TPT: పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు స్విమ్స్‌ను స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారని, స్విమ్స్ దేశంలో అత్యుత్తమ వైద్య సేవాసంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు. ఇందుకోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ.. ఏడాదికి రూ. 140కోట్లు అందిస్తూ.. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు.