NDL: చందలూరు గ్రామ శివారులో విషాహారం తిని 32 కోళ్లు మృతిచెందాయి. బాధితులు నాగార్జున, నాగేంద్ర తెలిపిన ప్రకారం.. సత్యం పొలంలో చల్లిన విషాహారం తినడంతో ఈ ఘటన జరిగింది. కోళ్ల మరణంతో రూ. 20 వేలకు పైగా నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు. రుద్రవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.