MNCL: మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన పి. చంద్రయ్య గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నస్పూర్‌లోని కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి మొక్కను అందజేశారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య గతంలో వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేశారు.