కృష్ణా: గుడివాడలో జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని వైసీపీ శ్రేణులు ఖండిస్తూ పెడనలో శాంతియుత ర్యాలీనీ గురువారం రాత్రి నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ సాగింది. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ర్యాలీలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.