ఎన్టీఆర్(NTR)-కొరటాల శివ(koratala siva) సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక ప్రచారం జరుగుతునే ఉంది. అందుకు కారణం ఇప్పటి వరకు ఈ సినిమాను మొదలు పెట్టకపోవడమేనని చెప్పొచ్చు. దాంతో ఎన్టీఆర్ 30 అప్టేట్ ఏంటనే విషయంలో.. నందమూరి అభిమానులు కలవరపడుతునే ఉన్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరో పుకార్లు షికారు చేస్తోంది. ముఖ్యంగా స్క్రిప్టు ఫైనలైజ్ అవడం లేదనేది ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే ముందుగా అనుకున్న కథను పక్కకు పెట్టి.. మరో పవర్ ఫుల్ స్టోరీని కొరటాల రెడీ చేశాడని.. దాంతో ఎన్టీఆర్ స్క్రిప్టు లాక్ చేశాడని వార్తలొచ్చాయి.
అంతేకాదు రేపో, మాపో షూటింగ్ అప్టేట్ రాబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కొరటాల ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడని.. ఎట్టి పరిస్థితుల్లోను నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కథ మొదటికొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా స్క్రిప్ట్ విషయంలో కొరటాల మార్పు, చేర్పులు చేస్తునే ఉన్నాడట. ఈ క్రమంలో తాజాగా మెడికల్ మాఫియాకు సంబంధించిన ఓ కొత్త కథ తెరపైకి వచ్చింది.
సోషల్ మెసేజ్‌తో కూడిన మెడికల్ మాఫియా లైన్ ఎన్టీఆర్‌కు నచ్చడంతో.. ప్రస్తుతం దానిపైనే కసరత్తులు చేస్తున్నాడట కొరటాల. ఇదే నిజమైతే.. మళ్లీ ఈ కొత్త స్టోరీ పూర్తవడానికి మరింత సమయం పట్టేలా ఉందంటున్నారు. ఆ లెక్కన ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాదిలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అయినా కూడా ఎన్టీఆర్, కొరటాల నుంచి ఎలాంటి అఫీషియల్ అప్టేట్ రావడం లేదు. మరి ఎన్టీఆర్-కొరటాల మధ్య ఏం జరుగుతుందో వాళ్లకే తెలియాలి.