BDK: చర్ల మండల కేంద్రంలో పీడీఎస్యూ నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీవైఎల్ అధ్యక్షుడు సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికై పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుళ్ళు గోపురాలు అంటూ నిధులు కేటాయించుకుని కాలయాపన చేయడం సరైనది కాదన్నారు.