మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో భాషాపరమైన వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు ఆర్ మాధవన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఇన్నేళ్ల నా కెరీర్లో నేనెప్పుడూ భాష కారణంగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. నేను తమిళం, హిందీలో మాట్లాడగలను. కొల్హాపూర్లో చదువుకున్నాను.. కాబట్టి నాకు మరాఠీ కూడా వచ్చు. అందుకే ఎప్పుడూ ఏ సమస్య రాలేదు’ అని చెప్పారు.