AP: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. వైసీపీ శ్రేణుల దాడిలో శివకుమార్ గాయపడిన విషయం తెలిసిందే. శివకుమార్‌ను మంత్రి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టమని హామీ ఇచ్చారు.