ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రెండు సిక్సర్లు బాదడంతో ఈ రికార్డు నమోదు చేశాడు. 34 సిక్సర్లతో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న రికార్డును పంత్(35) బ్రేక్ చేశాడు.