WGL: చెట్టును మనం కాపాడితే మనల్ని చెట్టు కాపాడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వన మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆకుపచ్చని తెలంగాణ కోసం శక్తి వంచన లేకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమం చేపట్టాలి అని అన్నారు.