MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఠలేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.