HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరుగు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరిశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో జరుగు స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు.