NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలకపల్లిలో వెలసిన ఎనిమిది పీర్లను సందర్శించి దట్టి వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులమతాలు ఏకమై జరుపుకునే మొహరం పండుగ చరిత్ర గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ వారణాసి శ్రీనివాసులు, జిలాని, నిస్సార్, మల్లేష్ గౌడ్, కిరణ్ పాల్గొన్నారు.