TPT: వాకాడు గ్రామంలోని మురారి వెంకటయ్య, దీనమ్మ దంపతులకు చెందిన పూరిగుడిసె గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. గుడిసె పూర్తిగా కాలిపోవడంతో ఇంట్లో ఉన్న రూ.25వేల నగదు, విలువైన వస్తువులు, వంట సామగ్రి, విద్యార్థుల సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని ప్రమాదానికి తాము నిరాశ్రయులమయ్యామన్నారు.