ప్రకాశం: పుల్లలచెరువు మండలం పిడికిటివారి పల్లిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. పెద్దిరాజు అనే గొర్రెల కాపరికి చెందిన 15 గొర్రె పిల్లలను గురువారం దాడి చేసి హతమార్చాయి. దీంతో ఆ రైతుకు దాదాపు లక్ష వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరో 8 గొర్రె పిల్లలు తీవ్రంగా గాయపడి మృతి చెంది అవకాశం ఉందని తెలిపాడు.