W.G: ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామ కాలువ గట్టుపై నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలంటూ సీపీఎం నాయకులు, బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఇంటి స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, బొడ్డుపల్లి రాంబాబు పాల్గొన్నారు.