TG: పాశమైలారం ఘటనపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమకు చేరుకుంది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. శాస్త్రవేత్తలు వెంకటేశ్వరరావు, ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్‌లతో కూడిన కమిటీ నెల రోజుల్లో ప్రమాదంపై నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొంది.