ELR: గొర్రెల, మేకల పెంపకం దారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం భోగాపురంలో మేకలు, గొర్రెలలో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. నట్టల నివారణ మందులను ప్రభాకర్ రైతులకు అందజేశారు.