BPT: బాపట్లలో రహదారిపై శుక్రవారం ఓ మహిళ ప్రసవించిన ఘటన నెలకొంది. చీలురోడ్డు వద్ద చిత్తుకాగితాలు ఏరుకునే మహిళకు ఆకస్మికంగా పురిటినొప్పులు రావడంతో స్థానికులు సహాయం చేశారు. వారి సహయంతో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహిళకు సహాయం చేసిన వారిని పలువురు అభినందించారు.