HNK: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు విద్యార్థినులకు అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు గడువును ఈనెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, వరంగల్ వెస్ట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోలి శ్రీలత గురువారం తెలిపారు. కళాశాలలో B. COM, బీఏ కోర్సులలో ప్రవేశాలకు అవకాశం ఉందని తెలిపారు.