VSP: ఎండాడ రహదారికి ఆనుకొని ఉన్న చెరువును అభివృద్ధి చేయాలని, వాకింగ్ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాకర్స్ వాపోతున్నారు. రోడ్డు అంతా కంకర పిక్కలు తేలి ఉన్నాయన్నారు. ప్లాస్టిక్, చెత్త చెదారంతో నిండిపోతుందని, మందుబాబులు రాత్రి అయితే పార్కులోకి చొరబడుతున్నారన్నారని పోలమాంబ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.