వినడానికి విచిత్రంగా ఉన్నా చేయి పట్టుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందట. నచ్చిన వారి చేయి పట్టుకుంటే మనసుకు ఆనందాన్నిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. స్త్రీ, పురుషులు సానుకూల ఆలోచనలతో ఒకరినొకరు చేయి పట్టుకోవడంతో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై స్ట్రెస్ తగ్గుతుంది. తల్లిదండ్రులు, పిల్లల చేయి పట్టుకున్నా, స్నేహితులు పరస్పరం చేయి పట్టుకోవడం ఆత్మస్థైర్యాన్నిస్తుంది.