ADB: దుకాణాల యజమానులు ఎరువుల కొరత సృష్టిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి వివేక్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు.