BDK: తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజంపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు సేవాలాల్ సేన రూపొందించిన “చలో హైదరాబాద్” కార్యక్రమానికి మద్దతుగా మణుగూరు మండలంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.