ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడికి బుధవారం ఆలయ అర్చక పురోహితులు రామకృష్ణ ఈరోజు అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే స్వామికి పంచామృత, కుంకుమార్చనలు, ఏకబిల రుద్రాభిషేకం చేపట్టి స్వామి మూల విరాట్‌ను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. అనంతరం భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.