NLG: సెక్రటేరియట్లో మంత్రిగా భాద్యతలు చేపట్టిన రాష్ట్ర పశువర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి శాలువాతో సత్కరించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.