BHPL: భూపాలపల్లిలోని కాకతీయఖని లారీ ఓనర్స్ అండ్ వెల్పర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని పలువురు లారీ యజమానులు తెలిపారు. మొత్తం సభ్యులు 362 వరకు ఉన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు రెండు రోజుల నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టారు.