దుల్కర్ సల్మాన్ హీరోగా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబరు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.