గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రవీంద్రభారతి వేదికైంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్ హాజరవుతున్నారు. అయితే విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరికలు రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించనున్నారు. రవీంద్రభారతి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, ఎలాంటి గొడవలు జరగకుండా నిఘా పెట్టారు.