ASF: ఆసిఫాబాద్ మండలం, జన్కపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రామాలయం షెడ్డు నిర్మాణానికి MLA కోవ లక్ష్మి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం శ్రీరాముడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. నిర్మాణ పనులకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.