ELR: కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీఏ (పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్), బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బి.ఎస్సీ (జువాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయబాబు ఆదివారం తెలిపారు.