GNTR: బుడంపాడు వద్ద రూ.1,97,76,000విలువైన అక్రమ GTPL STEP, GTPL విమల్ సిగరెట్లను శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా లారీని సీజ్ చేశారు. బీహార్‌కు చెందిన సుభాష్, గుంటూరుకు చెందిన సూర వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వెంకటేశ్వరరావు, నిరంజన్, డ్రైవర్ ధరందేవ్, సుభాష్‌లపై పాత గుంటూరు PSలో ఫిర్యాదు నమోదైంది.