»3641 New Covid Cases In The India Active Cases Are Over 20 Thousand
Covid Cases: దేశంలో కొత్తగా 3,641 కోవిడ్ కేసులు..20 వేలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో(india) కొత్తగా 3,641 కరోనా కేసులు(corona cases) నమోదు కాగా..మరో 11 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కు పెరిగింది. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
భారతదేశంలో(india) కొత్తగా 3,641 COVID-19 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం అప్డేట్ చేసిన గణాంకాలను ప్రకటించింది. మరోవైపు గత 24 గంటల వ్యవధిలో 11 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల(deaths) సంఖ్య 5,30,892కు పెరిగింది. ఈ నేపథ్యంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉండగా..వారాంతపు సానుకూలత రేటు 2.45 శాతంగా రికార్డైంది. ఈ నేపథ్యంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లుకు (4,47,26,246) చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.05 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.41 కోట్లు (4,41,75,135) కాగా, కేసు మరణాల రేటు 1.19గా నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్(vaccination drive) కింద ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు ఇన్ఫ్లుఎంజా లక్షణాలతోపాటు కరోనా వచ్చిందనే(coronavirus symptoms) అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. ఇన్ఫ్లుఎంజా వైరస్ లక్షణాల్లో భాగంగా అధిక జ్వరం, ఓళ్లు నొప్పులు, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు, అతిసారం వంటివి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకుని ఆస్పత్రుల్లో చేరాలని వైద్యాధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో కరోనా కట్టడి చర్యల గురించి చర్చించి మార్గదర్శకాలను కూడా అధికారులు జారీ చేశారు.