మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి తామునిత్యం అందుబాటులో ఉంటామని బోయినపల్లి సీఎంఆర్ ఉన్నతపాఠశాల డైరెక్టర్ ఎస్కే రెడ్డి తెలిపారు. బోయినపల్లిలోని బాపూజీనగర్ ప్రభుత్వగిరిజన సంక్షేమఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ లాలునాయక్కు సీఎంఆర్ విద్యాసంస్థల అధిపతి సీహెచ్ గోపాల్ రెడ్డి సహకారంతో గిరిజన ఆశ్రమ పాఠశాలకు శుక్రవారం బెంచీలు అందజేశారు.