మేడ్చల్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్టాండింగ్ కమిటీ సభ్యుడు జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్ఖడే కలిసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. స్పందించిన కమిషనర్ అభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు.