SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే నూతన కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇందులో జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో ఎం కృష్ణమూర్తి, డ్వామా పీడీ సుధాకర్ పాల్గొన్నారు.