VZM: జిల్లా పోలీసుశాఖలో కమ్యూనికేషన్ ఇన్స్పెక్టరుగా పని చేసి, ఉద్యోగ విరమణ చేసిన రమణమూర్తికి SP వకుల్ జిందల్ అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ప్రదానం చేశారు. క్రమశిక్షణతో సంతృప్తి కరంగా విధులు నిర్వహించి, నిస్వార్థంగా సేవలందించే పోలీసు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవా పతకం అందిస్తుందని SP అన్నారు.