ఆపరేషన్ సింధూర్, తర్వాతి పరిణామాలపై కాసేపట్లో విదేశాంగశాఖ మీడియా సమావేశం నిర్వహించనుంది. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడం, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం వంటి పరిణామాలపై మాట్లాడనుంది. ఈ ప్రెస్మీట్లో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొననున్నారు.