ELR: బుట్టాయగూడెం మండలంలోని బుసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ సారధులను త్వరగా నియమించుకోవాలని సూచించారు. అనంతరం వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు.