GNTR: పట్టణ సీతమ్మ కాలనీలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.