PLD: బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంఘం ఎడ్లపాడు మండలం గోపాలపురంలో ఆస్తి నష్టం వాటిల్లింది. చెట్లు విరిగి ఇళ్లపై పడటంతో పాటు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ మేరకు గురువారం గ్రామంలో ఎమ్మార్వో విజయశ్రీ, వీఆర్వో, టీడీపీ నాయకులు పర్యటించి జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు.