AP: ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు రాష్ట్ర కేబినెట్ అభినందనలు తెలిపింది. అలాగే అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని మోదీకి మంత్రివర్గం ధన్యవాదాలు చెప్పింది. 47వ CRDA సమావేశంలో నిర్ణయాలకు, రాజధాని పరిధిలో వివిధ, సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించింది.