KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో నిత్య పూజలకు విరామం కల్పించినట్లు అర్చకులు తెలిపారు. గురువారం ఏకాదశి సందర్భంగా నిత్య పూజలైన పంచామృత అభిషేకాలు, పట్టు వస్త్రాలు, బంగారు కవచాలు, అలంకరణలు ఉండవని పేర్కొన్నారు. బృందావనానికి మంగళ హారతులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి యథావిధిగా పూజలు ప్రారంభమవుతాయని వివరించారు.