ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం వివరిస్తోంది. ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మల, నడ్డా, కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాగా.. పాక్పై కేంద్రం చర్యలకు ఇప్పటికే అన్ని పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.