ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నటసింహం బాలకృష్ణ(Balayya) మధ్య పోటీ గట్టిగా ఉండబోతోంది. ఇప్పటికే మెగా, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో ఎవరిది పై చేయి అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిజినెస్(business competition) పరంగా కూడా ఈ సినిమాలు తగ్గేదేలే అంటున్నాయట. దాంతో ఈ సినిమాల ప్రీ బిజినెస్‌పై కూడా సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టే.. ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందట.
ఈ రెండు చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం బిజినెస్ డీల్స్‌ను క్లోజ్ చేసే పనిలో ఉందట. ఇప్పటికే ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ అమెరికాలో ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. ఈ రెండు సినిమాలను కూడా 7 కోట్లకు అటు ఇటుగా ఓవర్సీస్ డీల్ చేసినట్టు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లోను భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. సీడెడ్‌లో ‘వాల్తేరు వీరయ్య’కు15 కోట్లు, ‘వీరసింహారెడ్డి’ 13 కోట్లకు కోట్ చేసినట్టు టాక్.
ఇక మిగతా అన్నీ ప్రాంతాలు కలుపుకుంటే రెండు సినిమాలు కూడా.. 40 నుంచి 45 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అఖండతో బాలయ్య… గాడ్ ఫాదర్‌తో చిరంజీవి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.. కాబట్టి బిజినెస్ పరంగా ఇద్దరిలో ఎవరిది పైచేయి అవనుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇకపోతే.. వాల్తేరు వీరయ్యను బాబీ తెరకెక్కిస్తుండగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి తెరకెక్కుతోంది. మరి ఈ సీనియర్ హీరోల్లో సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి.