PLD: వినుకొండలోని ప్రధాన రహదారుల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో అధారాలు సేకరణ కోసం పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలిస్ శాఖ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో పట్టణంలో కెమెరాల ఏర్పాటు నిమిత్తం రూ.15లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.