KDP: మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించాలని సీఐటీయూ మైలవరం మండల కన్వీనర్ ఏ. వినయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా మైలవరంలో ఆటోస్టాండ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉన్న సీఐటీయూ స్తూపాలను మైలవరం ఆటో స్టాండ్ కార్యదర్శి గైబూసా(నన్నే), వినయ్ కుమార్లు ఆవిష్కరించారు.