KDP: చక్రాయపేటలో గురువారం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. కుప్పం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇటీవల గాయపడిన వైసీపీ నేత రాంబాబును పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సురభి గ్రామ సర్పంచ్ బోయిన రవణమ్మను పరామర్శించారు.