KDP: అమరావతిలో శుక్రవారం జరిగే ప్రధాని మోదీ సభకు వెళ్లేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. బస్సుల్లో వెళ్లే వారికి భోజనం సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.