గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే పెన్షన్లు అందుకున్న అవ్వ, తాతల ముఖంలో ఆనందం వెలకట్టలేనిది అన్నారు. కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.